
*పార్టీ మారిన ఎమ్మెల్యేలపై..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీ ఆర్ ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు. బీ ఆర్ ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చె
ప్పిన విషయాన్నివిలేకరులు కేటీఆర్ దృష్టికి తీసుకురాగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ కోవకు చెందిన వారో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
పీసీసీ చీఫ్ నేరాంగీకారం చేశాక ఈ విషయంలో ఇంకా చర్చ దేనికి? ఆ పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి స్పీకర్‌కు మోహమాటం దేనికని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి కూడా చెప్పారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నందునా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు.
………………………………………….