* ప్రియుడి కోసం కేరళకు!
* కేరళలో ఒక్కటైన ప్రేమికులు
* పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి హాజరు
ఆకేరు న్యూస్, డెస్క్: ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో పూసల గొలుసులు అమ్ముతూ, తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసిన మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోస్లే గుర్తుందిగా? ఒక్క వైరల్ వీడియోతో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయిన ఈమె, ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా అవకాశాల వల్ల కాదు.. తన ప్రేమ వ్యవహారంతో హాట్ టాపిక్‌గా మారింది.
కుంభమేళా టూ టాలీవుడ్..
కుంభమేళాలో మోనాలిసాను చూసిన నెటిజన్లు ఆమెను ‘వైరల్ బ్యూటీ’గా పిలుచుకున్నారు. ఆ పాపులారిటీతో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. ఇప్పటికే బాలీవుడ్లో ఒక సినిమా చర్చల దశలో ఉండగా, తెలుగులో సాయి చరణ్ హీరోగా నటిస్తున్న ‘లైఫ్’ అనే చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయంలోనే మోనాలిసా తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఫేస్బుక్ ప్రేమ.. కేరళలో ప్రత్యక్షం!
తాజా సమాచారం ప్రకారం, మోనాలిసా కేరళలోని తిరువనంతపురంలో ప్రత్యక్షమైంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఆమె గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె మధ్యప్రదేశ్ నుండి నేరుగా కేరళకు చేరుకుంది.
పోలీసులను ఆశ్రయించిన జంట..
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారాన్ని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తమ ప్రేమకు పెద్దల నుంచి ముప్పు ఉందని భావించిన ఈ జంట, రక్షణ కల్పించాలని కోరుతూ తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగి, హీరోయిన్గా సెటిల్ అవుతుందనుకున్న
పెళ్లికి కేరళ ప్రభుత్వ మద్దతు ..
మోనాలిసా తన ప్రియుడిని పెళ్లాడారు. మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్ ను బుధవారం కేరళలోని ఆరుమనూర్ శ్రీ నయినార్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, మరికొందరు రాజకీయ నేతలు స్వయంగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వివాహాన్ని నెటిజన్లు “రియల్ కేరళ స్టోరీ” అంటూ సోషల్ మీడియాలో అభినందనలతో ముంచెత్తుతున్నారు.
