
* కష్టానికి తగ్గ జీతాలు ఇవ్వాలి
* ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి
* రోడ్డెక్కిన జొమాటో డెలివరీ బాయ్స్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : తమ కష్టానికి తగ్గ జీతాలు చెల్లించాలని జొమాటో డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. జొమాటో యాజమాన్యం తయను శ్రమదోపిడీకి గురిచేస్తొందని ఆరోపిస్తూ ఉప్పల్ లో తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్లకార్డుల ద్వారా తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. రోజుకు 14 గంటలు కష్టపడుతున్నా కనీసం ఐదు వందలు కూడా సంపాదించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. నిత్యం రోడ్లపై తిరిగే తమకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమకుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
…………………………………….