
* పూజల పేరుతో లక్షల్లో మోసం
* ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టు, చేవెళ్ల కోర్ట్‌లో హాజరుపరిచిన పోలీసులు
* 14రోజులు రిమాండ్ విధించిన కోర్ట్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడి అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఓ మహిళను మోసం చేసిన కేసులో సైబారాబాద్ పోలీస్ విభాగంలోని మొకిల పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్‌కు చెందిన సినీ నిర్మాతను లేడి అఘోరి అలియాస్ శ్రీనివాస్ (28). సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని తనను ఆధ్యాత్మిక రక్షకుడుగా చూపిస్తూ ఆమెను భావోద్యోగ పూరితంగా ప్రభావితం చేసి, తన కుటుంబాన్ని ద్రుష్టశక్తుల నుంచి రక్షించేందుకు తంత్ర పూజలు చేయవల్సిన అవసరం ఉందని చెప్పి తనను నమ్మించి ఒకసారి రూ.5లక్షలు తరువాత మరోసారి బెదిరించి 4.80లక్షలు తీసుకున్నాడు. బాధితురాలిని కత్తులతో, తుపాకులతో తంత్ర శక్తులతో చంపేస్తానని బెదిరిస్తూ ఇంకా 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేసాడు. దీంతో బాధితురాలు భయంతో పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. 308(5),318(1),351(3),352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని నిందుతుని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని అరెస్టు చేశామున్నారు. నిందుతుడిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చేవెళ్ల కోర్ట్‌లో హాజరుపరిచగా 14రోజులు రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు.
……………………………….