* ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కలెక్టరేట్ సహా గచ్చిబౌలిలోని మైత్రీ హోమ్స్ లో సోదాలు కొనసాగాయి. భూరికార్డుల ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. మూడు బృందాలుగా అధికారులు వేర్వేరు చోట్ల సోదాలు జరుపుతున్నారు. అంతేకాకుండా రాయ్దుర్గ మై హోమ్ భుజ, బాలానగర్, రంగారెడ్డి కలెక్టరేట్ తోపాటు జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు. శ్రీనివాస్ సోదరుడు, బంధువులు ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అదేవిధంగా పలు చోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మహబూబ్నగర్లో ఒక రైస్ మిల్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.
……………………………………….
