
* ఏఎస్పీ మృతి
* జవాన్లకు గాయాలు
ఆకేరు న్యూస్ డెస్కః గత కొద్ది రోజులుగా చత్తీస్ ఘడ్ లో భయానక యుద్ద వాతావరణం చోటుచేసుకుంది. కేంద్ర భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది.. కేంద్రం చేపట్టిన కగార్ ఆపరేషన్ లో భాగంగా కేంద్ర భద్రతా దళాలు చత్తీస్ ఘడ్ ప్రాంతాన్న జల్లెడ పడుతున్నాయి గత కొద్ద రోజులుగా భద్రతా దళాల చేతిలో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన విషయం తెల్సిందే… అయితే తాజాగా జరిగిన ఘటనలో మావోయిస్టులు పథకం ప్రకారం రెచ్చిపోయారు. మావోయిస్టులు పేల్చు ఈఈడీ బాంబ్ ఘటనలో కొంట అదనపు ఏ ఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజీ మృతి చెందారు . ఈ ఘటన సుక్మా జిల్లాలో జరిగింది. జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్‌లో ప్రోక్లెయిన్కు మావోయిస్ట్‌లు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలియడంతో విచారణ కోసం ఘటనా స్థలానికి ఏఎస్పీ ఆకాశ్‌రావు గిర్పుంజే చేరుకున్నారు. ఈ సమయంలోనే మావోయిస్ట్‌లు మాటు వేసి ఏఎస్పీ వాహనాన్ని ఐఇడీతో పేల్చడంతో ఏఎస్పీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏఎస్పీని స్థానిక ఆస్పత్రిలో వైద్యం కోసం తరలించారు. హాస్పిటల్లో ఏఎస్పీ ఆకాశ్‌రావు చికిత్స పొందుతూ మృతిచెందారు. జూన్ 10న మావోయిస్టులు బంద్ ఇచ్చిన నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మావోలు చిక్వార్ వద్ద పొక్లెయిన్‌ను దహనం చేయడంతో ఆ ప్రదేశానికి పరిశీలించేందుకు పోలీసులు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
……………………………………………