* సక్సెస్ నాలో కసిని పెంచుతుంది.
* రికార్డులు తిరగ రాసేది నేనే..
– హీరో బాలకృష్ణ
ఆకేరు సినిమా: సినిమా అంటే కేవలం కాలక్షేపం కాదు. ఒక సామాజిక బాధ్యత . సందేశాత్మక చిత్రాలు అందించినప్పడు తప్పని సరిగా ప్రజలు ఆదరిస్తారని హీరో బాలకృష్ణ అన్నారు. లెజెండ్ సినిమా విడుదలయి పది సంవత్సరాలు పూర్తి కావస్తున్న సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు సినిమా ఇపుడు దేశాన్ని ప్రభావితం చేస్తోంది. ఎంతో ఆనందంగా ఉంది. సినిమా మంచిదయితే ప్రేక్షకులు ప్రోత్సహిస్తారు. ఇలాంటివే ఇంకా కావాలని ప్రోత్సహిస్తారు. రికార్డులు నాకేం కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్ననేనే.. దాన్ని తిరగ రాయాలన్న నేనే .. అని బాలకృష్ణ అన్నారు.లెజెండ్ సినిమా 400 రోజులు 4 ఆటలతో రెండు సెంటర్లలో విజయవంతంగా ఆడి ఆల్ టైం రికార్డ్ సృష్టించిందన్నారు. సౌత్ ఇండియాలోనే 1116 రోజులు ఆడిన ఏకైక సినిమా లెజెండ్ అన్నారు. సినిమాలు సక్సెస్ అయితే నాలో మరింత కసి పెరుగుతుంది. ఇంత గా ఆదరించిన ప్రేక్షకుల కోసం మరిన్ని మంచి సినిమాలు చేయాలన్న తపన పెరుగుతుందన్నారు.

————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
