ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆ సమావేశాల్లో పలు కీలకచట్టాల ఆమోదానికి పభ్రుత్వం సన్నద్దమవుతుంది. డిసెంబర్ 7తో రాష్ట్ర సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం.. అలాగే పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. పంచాయతీ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు రేవంత్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలక్షన్స్‌కు ముందు పెన్షన్, రైతు భరోసాను పెంచితే ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు పార్టీకి మైలేజీ వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. గత పదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించి అసెంబ్లీలో వాడీవేడీ చర్చకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు సమాచారం.
…………………………….