* పశువుల కాపరులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి
* చిన్నపిల్లలను రాత్రి వేళలో బయటికి పంపించొద్దని సూచించారు.
* అవసరమైతేనే తప్ప అడవుల్లోకి వెళ్లొద్దు
* అటవీ శాఖ అధికారుల విజ్ఞప్తి
ఆకేరున్యూస్, ములుగు : ములుగు జిల్లాలోని మదనపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. మదనపల్లి, పత్తిపళ్లి, పొట్లాపూర్, దేవగిరిపట్నానికి చెందిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పాఖాల నుంచి ములుగు అటవీ ప్రాంతానికి వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్రమత్తమై 30 మందితో కూడిన ప్రత్యేక సిబ్బందితో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పశువుల కాపరులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను రాత్రి వేళలో బయటికి పంపించొద్దని సూచించారు. అవసరమైతేనే తప్ప అడవుల్లోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.