
* పెద్దపల్లి పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్, పెద్దపల్లి : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ
సంకల్పంలో భాగస్వామ్యం అవుదామని పెద్దపల్లి జిల్లా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (ambar kishor jha) అన్నారు. నాషా ముక్త్ భారత్ అభియాన్-2025 లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్ కిషోర్ ఝా అధికారులు, సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA)ను అమలు చేస్తోందని అన్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు ఇందులో అధిక సంఖ్యలో భాగస్వామ్యం కావాలని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ ఏవో శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, సిసిఆర్ బీ ఇన్స్పెక్టర్ సతీష్, పిసిఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు భీమేష్, శ్రీనివాస్, ఆర్ ఐ లు శ్రీనివాస్ వామనమూర్తి, సిపిఓ సూపరిండెంట్ లు ఇంద్రసేనారెడ్డి సందీప్, సంధ్య, వివిధ విభాగాలకు చెందిన ఎస్ఐలు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………