
* కుటుంబసభ్యుల ఆందోళన
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : పోలీసు టార్చర్ వల్లే చనిపోయాడంటూ నిజామాబాద్ జిల్లాలో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ మందుకు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా(Jagityala District)కు చెందిన సంపత్ శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్‌తోపాటు మరో ఏజెంట్‌పై పది రోజుల క్రితం కేసు నమోదు చేశారు. వారిని అందుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే బాధితుల డబ్బులు రికవరీ కోసం సైబర్ క్రైమ్ (Cyber Crime)పోలీసులు విచారణ నిమిత్తం రెండు రోజుల క్రితం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం సంపత్‌ను తన స్వస్థలమైన జగిత్యాలకు తీసుకువెళ్లారు. గురువారం రాత్రి 9.45 నిమిషాలకు తిరిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కొద్ది సేపటికే తన చెయ్యి నొప్పిగా ఉందని నిందితుడు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సమయానికి సంపత్ మరణించాడు. శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల టార్చర్ వల్లే సంపత్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
………………………………