* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్ హనుమకొండ : జూన్ 14న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని ఆయన తెలిపారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని కమిషనర్ కోరారు.జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా లోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది అని పోలీస్ కమిషనర్ తెలియజేయడం జరిగింది.
………………………………………….
