
* పాక్ ఆయువు పట్టు ప్రాంతాలపై టార్గెట్
* భారత్ ప్రతిదాడులతో పాక్ విలవిల
* సేఫ్ హౌస్‌కు ఆ దేశ ప్రధాని
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా కొనసాగిస్తోంది. దాయాది దేశం గుండెల్లో గుబులు రేపుతోంది. వరుస దాడులతో బెంబేలెత్తిస్తోంది. పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత్ సమర్దవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్(Pakisthan)లో 7 కీలక ప్రాంతాలపై భాతఠ్ దాడులకు దిగింది. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇందులో కరాచీ టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహంతో దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి. కరాచీని ప్రత్యేకంగా టార్గెట్‌గా చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. పాకిస్తాన్ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంది. పాకిస్తాన్లో అత్యంత కీలకమైన సీ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. అందుకే పాకిస్తాన్‌కు గుండెకాయ లాంటి ప్రాంతాలను భారత్ (Bharath) టార్గెట్ చేసింది. భారత్ రాత్రంతా కొనసాగించిన దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలను భారత్ నేలమట్టం చేసింది. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను కూల్చివేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. భారత్‌వైపు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. ఇదిలా ఉండగా భారత్ దాడులతో ఏకంగా పాక్ ప్రధాని షరీఫ్ సేఫ్ హౌస్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఆయన ఇంటి సమీపంలోనే బాంబు పేలడంతో ఆయన బంకర్ లోకి వెళ్లినట్లు సమాచారం.
………………………………………..