
* భూగర్భ జలాలు భవిష్యత్తు తరాలకు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపు
ఆకేరున్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఉదయం టేకులపల్లి మండలంలోని సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రు తండా, కొత్త తండా గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పారా పట్టి పారం పాండు పనుల్లో పాల్గొన్నారు. స్వయంగా మట్టిని తట్టలోకి ఎత్తి దానిని మోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకి భూగర్భ జలాలు ఉండాలంటే ప్రతి రైతు వ్యవసాయ భూములలో పారం పాండు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఉపాధి కూలీల సాధకబాధకలు తెలుసుకున్నారు. పలు గ్రామాలలో విద్యుత్ సమస్య, పోడు భూముల్లో విద్యుత్ సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రస్తుతం రైతులకు మిర్చి వాణిజ్య పంటలే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే మునగ సాగు, వెదురు సాగుపై అవగాహన కల్పించారు. పలు గ్రామాలలో మునగ సాగు క్షేత్రాన్ని పరిశీలించారు. మునగ సాగుపై అధికలాభం సాధించవచ్చని సూచించారు.
……………………………..