
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
* బొంపెల్లి రంగారావు పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బొంపెల్లి రంగారావు మరణించగా వారి పార్థివ దేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తనకు చిన్నప్పుడు విద్యాబుద్దులు నేర్పి తను ఇంత ఎత్తుకు ఎదగడానికి సహకరించిన చిన్ననాటి గురువును కోల్పోవడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………..