
* మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు
ఆకేరు న్యూస్ మెదక్ : మొబైల్ ఫోన్లు పోగుట్టుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని
CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ను తిరిగి పొందవచ్చని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు
సూచించారు. సోమవారం ఆయన రూ.25 లక్షల విలువ గల 167 మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే CEIR పోర్టల్ (www.ceir.gov.in) లో తప్పనిసరిగా వివరాలు వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు.ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.89 కోట్లు విలువ గల 1264 ఫోన్లు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు.మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి CEIR పోర్టల్ లో వివరాలు అప్టేట్ చేయాలని కోరారు. లేకుంటే వ్యక్తగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. సెకండ్ హ్యండ్ ఫోన్ కొనే మందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొబైల్ రికవరీలో ప్రతిభ కనబరిచిన IT కోర్ టీమ్ సిబ్బంది మరియు CEIR సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
……………………………………..