* గ్యాస్ బుకింగ్ నిబంధనలపై వదంతులు నమ్మకండి
* క్లారిటీ ఇచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ నిబంధనలు మారాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. పాత నిబంధనలే కొనసాగుతున్నాయని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ తీసుకున్నాక మరొక సిలిండర్ కోసం 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వేచి చూడాలని క్లారిటీ ఇచ్చింది . అపోహలు నమ్మవద్దని, సరిపోయినంత స్టాక్ ఉందని, అనవసరంగా బుకింగ్లు చేయవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ సిలిండర్ల వినియోగదారులు అధికారిక యాప్లు లేదా కస్టమర్ కేర్ ద్వారా మాత్రమే బుకింగ్ చేయాలని సూచించింది. ఎల్పీజీ సంబంధిత ఏవైనా ఇబ్బందులుంటే అధికారిక కస్టమర్ కేర్ నంబర్ 1800-233-3555 కు ఫిర్యాదు చేయాలని కోరింది.
