* పెరిగిన LPG సిలిండర్ల ధరలు
* కమర్షియల్ సిలిండర్ కూడా ఖరీదు…
* పెరిగిన ధరలు మార్చి 7 నుంచి అమల్లోకి
ఆకేరు న్యూస్ కమలాపూర్:
గ్లోబల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో LPG సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి.యుద్ధ పరిణామాలు, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా LPG సిలిండర్ల పై పెరిగిన ధరలు మార్చి 7 నుంచి అమల్లోకి రానున్నాయి.తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గృహ వినియోగ (డొమెస్టిక్) 14.2 కిలోల సిలిండర్ ధర రూ.60 పెరిగింది. హైదరాబాద్లో గతంలో 905 రూపాయలుగా ఉండగా ఇప్పుడు కొత్త ధర రూ.965 , ఉజ్వల యోజన సబ్సిడీ సిలిండర్లకు మాత్రం ధరలో ఎలాంటి మార్పు లేదు.వాణిజ్య (కమర్షియల్) 19 కిలోల సిలిండర్: రూ.115 పెరిగింది. హైదరాబాద్లో కొత్త ధర సుమారు రూ.2076 వరకు చేరుకుంది.
ఈ పెరుగుదల ప్రపంచవ్యాప్త యుద్ధ పరిణామాల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిడి, యుద్ధ ఫలితాలు ఇంధన మార్కెట్లపై సూటిగా ప్రభావం చూపడంతో భారతీయ వినియోగదారుల జీవన వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఈ మార్పు సాధారణ కుటుంబాలు, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు చిన్న వ్యాపారాలపై కూడా ప్రభావం చూపనుంది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల నిల్వలు సరిపోతాయని హామీ ఇచ్చినా, యుద్ధ పరిస్థితులు ధరలను పెంచాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో రాబోయే రోజుల్లో స్పష్టం అవ్వనుంది.
