* కౌంట్‌డౌన్ ప్రారంభం..
* సాయంత్రం 5.26 గంటలకు నింగిలోకి
ఆకేరు న్యూస్, డెస్క్ :
ఎల్.వి.ఎం3 – 5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రాకెట్ ప్రయోగంతో పాటు సీఎంఎస్ -3 ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపించనున్నారు. సాయంత్రం 5.26 గంటలకు నింగిలోకి చేరుకోనుంది. ఇది భారత భూభాగంతో సహా సముద్రాపు ప్రాంతాల్లోనూ సేవలను అందించునుంది. పీఎస్ ఎల్వీ రాకేట్‌ను నాలుడు దశల్లో ప్రయోగించారు. ఎల్.వి.ఎం3 – 5 రాకెట్‌ను మూడు దశల్లోనే పూర్తి చేయనున్నారు. శక్తివంతమైన రాకేట్ కావడంతో మూడు వేల కిలోల నుంచి ఆరు వేల కిలోలు కలిగిన ఉపగ్రహాలను సులభంగా నింగిలోకి తీసుకెళుతుంది.
బహుబలి రాకేట్..
43.5 అడుగుల ఎత్తు ఉన్న ఎల్వీఎం 03, ఎం 05 మల్లీ బ్యాండ్ కమ్యునికేషన్ శాటిలైట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ సీఎంఎస్ ఉపగ్రహం బరువు 4,410 కిలోలని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ప్రయోగానికి శనివారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 400 టన్నుల ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు. 110 ద్రవ ఇంధనంతో (ఎల్ 110)తో రెండో దశ, 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనంతో (సీ 25) ని మూడో దశలో పూర్తి చేస్తారు. ఇప్పటి వరకూ ప్రయోగించన ఏడు విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
……………………………………………………..
