– భారత LVM3 తో పంపిన అతి భారీ పేలోడ్గా రికార్డ్
– యువ శక్తితో, మన అంతరిక్ష ప్రయోగాలు మరింతగా
అభివృద్ధి – ప్రధాని మోడీ
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయి సాధించింది. బుధవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 8 గంటలకు LVM3-M6 మిషన్ ప్రయోగం విజయవంతం అయింది.
దాదాపు 6.1టన్నుల బరువు ఉండే రాకెట్(LVM3) లాంచ్ వెహికల్ మార్క్3 మిషన్ 6 సహాయంతో అమెరికాకు చెందిన AST స్పేస్ బ్లూ బర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా లో – ఎర్త్ ఆర్బిట్‌లోకి చేర్చింది. దేశీయంగా అభివృద్ధి చేసిన LVM3 ద్వారా భారత్ నుంచి పంపిన అతి భారీ పేలోడ్గా ఈ ప్రయోగం రికార్డు సృష్టించింది.
భూమి ఉపరితలం నుంచి సుమారు 160- 2,000 కి.మీ. ఎత్తు వరకు ఉండే (orbit) ఆర్బిట్ లో LVM3-M6 బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం ఉంటుంది.లో ఎర్త్ ఆర్బిట్ లో మోహరించిన అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇది. దీని ద్వారా ఉపగ్రహం-నుండి-మొబైల్ కనెక్టివిటీని , ప్రపంచ టెలికాం యాక్సెస్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ విజయవంతమైన మిషన్‌తో అంతర్జాతీయంగా ఉన్న క్లయింట్ల వాణిజ్య అంతరిక్ష సేవల్లో ఇస్రో యొక్క అభివృద్ధి మరింతగా పెరగనుంది.
ప్రశంసించిన ప్రధానమంత్రి మోడీ
భారతదేశ యువ శక్తితో, మన అంతరిక్ష ప్రయోగాలను ఇంకా అభివృద్ధి మారుతుందని ప్రధానమంత్రి మోడీ అన్నారు. LVM3 నమ్మకమైన హెవీ-లిఫ్ట్ పనితీరును ప్రదర్శిస్తుండటంతో, గగన్‌యాన్ వంటి భవిష్యత్ మిషన్లకు పునాదులను బలోపేతం అవుతు, వాణిజ్య ప్రయోగ సేవలను విస్తరించడానికి, ప్రపంచ భాగస్వామ్యాలను మరింతగా పెంచుతున్నాము.ఈ పెరిగిన సామర్థ్యం ఆత్మనిర్బర భారత్ స్వావలంబనకు ప్రోత్సాహం కంగా ఉంటుందని ప్రధాని మోడీ ప్రశంసించారు.

………………………………………

