
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పడిన జేడి మల్లంపల్లి మండలానికి స్థానిక సంస్థల ఎన్నికల వరకు తాత్కాలిక నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షునిగా ల్యాదే శ్యామ్ రావు ను నియమిస్తూ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ నూతన మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మండల వ్యాప్తంగా జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ మండల ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో విజయాలు సాధించాలని కోరారు ఆయన ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ములుగు PACS చైర్మన్ బొక్క సత్తి రెడ్డి ,ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, మండల నాయకులు సాంబయ్య స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….