
* శాసనసభలో మాగంటి గోపినాథ్ కు కేటీఆర్ నివాళి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాస్ లీడర్ అని ఆయన లేని లోటు తీరలేనిది అంటూ కేటీఆర్ నివాళులర్పించారు. మాగంటి మృతి కి సంతాపంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ అంటేనే సంపన్నులు నివసించే ప్రాంతం అని పేరు. కానీ అక్కడ ఉండేది మొత్తం పేద ప్రజలు. బస్తీలతో కూడిన ఏరియా. అలాంటి ఏరియాను మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని కేటీఆర్ కొనియాడారు. విద్యార్థి దశ నుంచి క్రియాశీలంగా రాజకీయాల్లో ఉన్నారు గోపీనాథ్. ఒక పార్టీని, నాయకుడిని నమ్ముకుంటే.. ఎన్టీఆర్ నాయకత్వంలో.. కేసీఆర్ నాయకత్వంలో కష్టమొచ్చినా నష్టమొచ్చినా పని చేశారు. ఎమ్మెల్యేగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు. అది గోపీనాథ్‌కు సాధ్యమైందని కేటీఆర్ అన్నారు.నియోజకవర్గంలో గోపన్న అని పిలుచుకుంటారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యేవారు గోపీనాథ్ అని కేటీఆర్ గుర్తు చేశారు. బతికినంత కాలం మాస్ లీడర్‌గా డైనమిక్‌గా ఉన్నారు. స్పందించే గుణం ఎక్కువ గోపీనాథ్‌కు. కేసీఆర్‌కు నమ్మిన విధేయుడిగా పని చేశారు. ఆయన మరణం పార్టీకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు. గోపీనాథ్ కుటుంబానికి మా పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
………………………………………