
* పేరు ఖరారు చేసిన బీఆర్ ఎస్ పార్టీ
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత పేరును బీఆర్ ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం మాగంటి సునీత పేరును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2025, జూన్ 8వ తేదీన గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారు.గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యం అయింది.
……………………………………………