
* మాగంటి గోపినాధ్కు సీఎం రేవంత్ నివాళి
* అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ( MAGANTI GOPINATH))అకాల మరణం జంట నగరాల పేద ప్రజలకు తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(REVANTH REDDY) మాగంటి గోపీనాథ్ మృతికి నివాళి అర్పిస్తూ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాగంటి గోపినాథ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎదిగారు అన్నారు. ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం స్థాపించినప్పుడు తెలుగుదేశంలో చేరి ఎన్టీఆర్ అభిమానం చూరగొనమే కాకుండా తెలుగు యువత అధ్యక్షడిగా పనిచేశారు అన్నారు.అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ డైరెక్టర్ గా ,వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారని అన్నారు. సినీ నిర్మాతగా కూడా ఆయన రాణించారని గుర్తుచేశారు. 2014 లో తాను రెండవ సారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మాగంటి మొదటి సారిగా శాసన సభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. రాజకీయా విభేదాలు ఉన్నా మాగంటి తనకు మంచి మిత్రుడు అని రేవంత్ గుర్తు చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించాడని అన్నారు. మాగంటి గోపీనాథ్ మరణం జూబ్లీహిల్స్ ప్రజలకు తీరని లోటు అన్నారు. మాగంటి క్లాస్ గా కన్పించే మాస్ లీడర్ అని రేవంత్ అన్నారు. మాగంటి మితభాషి ,సౌమ్యుడు అని సీఎం అన్నారు. మాగంటి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆ మాగంటి కుటుంబసభ్యలకు రేవంత్ తమ ఆనుభూతి తెలియజేశారు.
…………………………………….