Jubilee Hills BRS Constituency Candidate Maganti Sunitha
* నామినేషన్ రద్దు అంశంపై స్పందించిన మాగంటి సునీత
* ఆమె మాగంటి భార్యనే కాదంటూ కుమారుడు సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తన 4 సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ ఆమోదించారని బీఆర్ ఎస్ జూబ్లీహిల్స్ ( Jubilee hills ) నియోజకవర్గ అభ్యర్థి మాగంటి సునీత (Magangti Sunitha) ప్రకటించారు. సోషల్‌మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై తాను కూడా కొన్ని అభ్యంతరాలను ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దివంగత నాయకుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. సునీత, మాగంటి గోపీనాథ్ అసలు భార్యా భర్తలే కాదని ఆరోపించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఎన్నికల కమిషన్‌కు సునీత ఇచ్చిన అఫిడవిట్‌ను రద్దు చేయాలన్నారు. ఈ మేరకు ఈసీకి వినతి పత్రం అందజేశారు ప్రద్యుమ్న. గత ఎన్నికల సమయంలోనూ గోపీనాథ్ (Gopinath) తన అఫిడవిట్లో భార్య స్థానంలో సునీత పేరును పేర్కొన్నట్లు ఆరోపించారు. ఈ అంశంపై ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రద్యుమ్న కోరారు. ఈనేపథ్యంలో సునీత నామినేషన్ ను రిజెక్ట్ చేశారనే ప్రచారం జోరుగా జరిగింది. ఈక్రమంలో సునీత స్పందించారు. తన నామినేషన్ ను ఆర్ ఓ ఆమోదించినట్లు తెలిపారు. తనపై చేస్తున్న ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.
———————
