* మహబూబ్నగర్ జిల్లా వేములలో అనుమానాస్పద మృతి
* అత్యాచారం..హత్య అంటున్న కుటుంబసభ్యులు
ఆకేరు న్యూస్, వేముల : మహబూబ్నగర్ జిల్లా వేములలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. పాఠశాల సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. అధిక రక్తస్రావంతో యువతి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె మృతికి కారణమైన యువకుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
…………………………………………
