Lingya Thanda Incident
*తల్లి, కుమారుడు మృతి..
* చిన్నారి ఆచూకీ కోసం గాలింపు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం లింగ్య తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనలో తల్లి బానోత్ అనూష (35), తొమ్మిదేళ్ల కుమారుడు విశాల్ కృష్ణ మృతి చెందినట్లు సమాచారం. ఐదేళ్ల చిన్నారి వర్షిణి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
* కుటుంబ కలహాలే కారణమా?
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే, ఘటనకు దారితీసిన అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
* ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బావిలో గల్లంతైన చిన్నారి వర్షిణి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసుల విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో లింగ్య తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

