* పరోక్షంగా బిజెపి, ఆర్‌ఎస్‌లపై సోనియా ధ్వజం
* రాజ్యాంగ సంస్థలను గుప్పట్లో పెట్టుకున్నారన్న ఖర్గే
* బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం
ఆకేరున్యూస్, బెంగళూరు: మహాత్మాగాంధీ వారసత్వం ముప్పులో ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు అన్నారు. ఢల్లీిలో అధికారంలో ఉన్న వారు, వారికి మద్దతు ఇచ్చే సంస్థల నుంచి మహాత్మా గాంధీ వారసత్వం ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. పరోక్షంగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్పై సోనియా గాంధీ దాడి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గాంధీ సిద్దాంతాలు, సంస్థలు దాడులకు గురవుతున్నాయన్నారు. ఈ శక్తుల్ని ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించడం తమ పార్టీ పవిత్ర కర్తవ్యమని ఆమె చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు కర్ణాటక బెలగావిలో జరుగుతోంది. శతాబ్దం క్రితం ఇదే వేదికగా మహాత్మాగాంధీ కాంగ్రెస్‌కి అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ హాజరుకాలేదు. ఈ సందర్భంగా లిఖితపూర్వక ప్రకటనలో రాజ్యాంగ విలువలు, గాంధీ ఆశయాలను పరిరక్షించడం పార్టీ కర్తవ్యమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ బెలగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడవ్వడం పార్టీకి, స్వాతంత్య ఉద్యమానికి మలుపు అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. స్వాతంత్యం కోసం ఎలాంటి పోరాటం చేయని సంస్థలు మహాత్మాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయని, ఒక విషతుల్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాయని, వీటి వల్లే ఆయన హత్య జరిగిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న వారి వల్ల గాంధీ ఘటన ప్రమాదంలో పడిరదన్నారు. న్యూఢల్లీిలో అధికారంలో ఉన్నవారు, వారి సిద్దాంతాలు, సంస్థల నుంచి మహాత్ముడి వారసత్వానికి ముప్పు ఉందన్నారు. ఇదే వేదిక నుంచి భాజపాపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యంగపరమైన సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ‘జవహర్లాల్ నెహ్రూ, గాంధీ సిద్దాంతాలు, బీఆర్ అంబేడ్కర్ గౌరవం కోసం చివరి శ్వాస వరకు మేమంతా పోరాడుతాం. ఎన్నికల సంఘం వంటి రాజ్యంగపరమైన సంస్థలను భాజపా తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల పక్రియపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది. ఈసీ నిష్పాక్షికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల నియమావళిలో మార్పుల ద్వారా కేంద్రం ఏం చేయాలను కుంటోందని ఖర్గే ప్రశ్నించారు. వచ్చే ఏడాదిలో పార్టీలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎన్నికల్లో నెగ్గేందుకు అవసరమైన నైపుణ్యాలతో పార్టీని మరింత బలంగా సన్నద్ధం చేస్తాం. కేవలం శ్రమిస్తే మాత్రమే సరిపోదు. సమయానుకూలంగా వ్యూహాలు ఉండాలని.. ఒక నిర్దిష్ట మార్గం అవసరం. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి‘ అని పేర్కొన్నారు. కాగా.. బెళగావిలో ’నవ సత్యాగ్రప్‌ా బైఠక్’ ప్రారంభమైంది. జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ఖర్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్‌గాంధీ, జైరాం రమేశ్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, భూపిందర్ హుడా, రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు.
……………………………………………………..