*పరుగులు తీసిన రోగులు!
ఆకేరున్యూస్,మహబూబాబాద్: సైకో వీరంగంతో ఆసుపత్రి హడలి పోయింది.. ప్రాణ భయంతో రోగులు ,సిబ్బంది పరుగులు తీశారు. మహబూబాబాద్ ఆస్పత్రిలో గురువారం భయానక వాతావరణం నెలకొంది.వైద్యం కోసం వచ్చిన ఒక వ్యక్తి వస్తువులను ధ్వంసం చేస్తూ కత్తితో పొడుస్తానంటూ రోగులను బెదిరించాడు. అందరినీ భయపెడుతుంటే రోగులు ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆ వ్యక్తి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి గొంతు కోసుకోవడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతడి దగ్గర ఉన్న కత్తిని లాక్కున్నారు.. ఎట్టకేలకు అతడిని బంధించడంతో రోగులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు .
……………………………………………………

