Varanasi Movie Villain
అకేరు న్యూస్ హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న చిత్రం వారణాసి. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైమ్ ట్రావెల్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, పురాణ అంశాల కలయికతో రూపొందుతున్నది.
* బాలీవుడ్ నటుడు నెగిటివ్ షేడ్ పాత్ర
అప్పుడెప్పుడో రిలీజ్ హ్యాపీ మూవీ గుర్తుండకపోవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , డైరెక్టర్ కరుణాకరన్ కలయికలో వచ్చింది. అందులో ఒక ముఖ్యపాత్రలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కలించారు. తర్వాత పవన్ కల్యాణ్ నటించిన కొమురం పులిలో విలన్ గా నటించి మెప్పించారు. అనేక ఏళ్ల తర్వాత తిరగి వారణాసిలో నటిస్తున్నారని తెలుస్తోంది. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్.
* రూ. 1300 కోట్ల బడ్జెట్
వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి సమకురుస్తున్నారు. కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా మాటలు రాస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
