
* 8 న నిర్వహించనున్న సమావేశంపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) జూబ్లీహిల్స్‌లోని నివాసంలో శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి శనివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలపగా సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. సెప్టెంబరు 8వ తేదీన ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్లు, జిల్లా కమిటీ కోసం వేసిన కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో మహేష్‌కుమార్ గౌడ్ వివిధ అంశాలపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.
…………………………………