
* జీతం ప్రాసెస్‌లో నిర్లక్ష్యం చేసిన ఇద్దరు సిబ్బందిని ఇప్పటికే విధుల నుండి తొలగించారు .
* జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్
ఆకేరు న్యూస్, ములుగు: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన మైదం మహేష్ నెల వేతనం ( జీతం) ఆలస్యం ప్రభుత్వానికి సంబంధం లేదని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బానోత్ రవి చందర్ మాట్లాడుతూ ఈ నెల 3 వ తేదీన ములుగు మున్సిపాలిటీ లో మల్టి పర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న మైదం మహేష్ పురుగుల మందు తాగి మృతి చెందాడని ఈ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని అన్నారు .బి ఆర్ఎస్ హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక సమ్మెలు చేసిన రోజులు ప్రజలు మరిచిపోలేదని. సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా కలెక్టరేట్ల ఎదుట సఫాయి అన్నలు నిరసనలు చేస్తే పట్టించుకోని బి ఆర్ ఎస్, నేడు మోసలి కన్నీరు కారిస్తే కార్మికులు నమ్మే పరిస్థితి లేరని అన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న వేలాది పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతి నెల జీతాలు చెల్లించడం జరుగుతుందని ,రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ విధానాన్ని ప్రవేశపెట్టి, జీతాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకావడం జరిగిందని వివరించారు
బి ఆర్ ఎస్ హయంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50 వేల మందికి పైగా ఎం.పీ.డబ్ల్యూ కార్మికులకు ఇప్పుడు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు అందుతున్నాయి అని ఆయన అన్నారు.
ములుగులో మైదం మహేష్ జీతం ఆలస్యం కావడంలో ప్రభుత్వ తప్పిదం లేదు. జీతం ప్రాసెస్ చేసే సమయంలో స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వలన రెండు నెలల వేతనం ఆలస్యమైందని, స్థానిక సిబ్బంది పొరపాటుతో జరిగిందని బాధ్యులపై తక్షణ చర్య తీసుకొని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి, బిల్ కలెక్టర్‌ను విధులనుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. మైదం మహేష్ కుటుంబానికి పరిహారం అందించడం జరిగిందన్నారు. మైదం మహేష్ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు వంగ రవి యాదవ్,ములుగు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్,జిల్లా పార్టీ కార్యదర్శి యాసం రవీందర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ రఘు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనిల్ కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటోజు శంకర్ చారి,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నేపాల్ రావు,ములుగు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి, ములుగు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కల నాగరాజు,మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ షకీల్ అహ్మద్,మాజీ వార్డు సభ్యులు ఓడ రాజు,మైనారిటీ నాయకులు జాఫర్ పాషా, బండారుపల్లి మాజీ సర్పంచ్ కెక్కెర్ల అశోక్ గౌడ్,ములుగు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్ చారి,ములుగు పట్టణ ఉపాధ్యక్షుడు గందే రాజు,జిల్లా నాయకులు లక్కీ, పత్తిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ధారవత్ సారయ్య,యూత్ నాయకులు చందు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….