* లోకోపైలెట్ అప్రమత్తతతో తప్పిన భారీ ప్రాణనష్టం
* రైల్వే పనులు చేస్తుండుగా ఇద్దరి గాయాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : టాటానగర్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి వద్ద రైల్వే పనులు చేస్తుండగా విద్యుత్ స్తంభం ఒరిగి పడింది. ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ విద్యుత్ తీగలపై పడడంతో అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు ఆ మార్గం నుంచి వస్తోంది. విద్యుత్ వైర్లు నేలపై పడి.. స్తంభం ఒరిగిపోయి ఉండడాన్ని లోకో ఫైలెట్ గమనించి చాకచాక్యంగా వ్యవహరించారు. రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం.. పెను ప్రాణనష్టం తప్పింది. లోకోఫైలెట్ అప్రమత్తంగా లేకుండా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు వదిలేవారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయాలైన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
………………………………………..
