
* ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ :రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ ను ఓ ప్రైవేటు ట్రావెల్స్
బస్సు బలంగా ఢీకొట్టిన ఘటనలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటావరం స్టేజీ సమీపంలో 44వజాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటావరం స్టేజీ సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 31మంది ప్రయాణిస్తున్నారు. వారిలో అష్రస్ ఉన్నిసా (70), హసన్ (35), ఎల్లమ్మ (45)లు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యి.క్షతగాత్రులను 108 వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
…………………………………