
ఆకేరున్యూస్ నల్గొండః నల్గొండ జిల్లా నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం
ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి గూడెం వద్ద ఓ రెడీమిక్స్ లారీని గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్న డబుల్ డెక్కర్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు బాగం నుజ్జునుజ్జు అయింది. బస్ డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలుకాగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.బస్ క్యాబిన్ లో చిక్కుకున్న బస్ డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. బస్ డ్రైవర్‌ను సమీపంలో ఉన్న ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ల సహాయంతో తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు.
……………………………………………..