
* బీఆర్ఎస్ లేకుంటేె తెలంగాణ లేదు
* మాజీ మంత్రి హరీష్ రావు
ఆకేరున్యూస్, ఎల్కతుర్తి: రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.బిఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్రావు మాట్లాడుతూ. బిఆర్ఎస్ లేకుంటే తెలంగాణ లేదు.తెలంగాణ లేకుంటే అభివృద్ధి లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం. రైతులకు రుణమాఫీ చేసింది. రైతుభందు.రైతుబీమ. కల్యాణ లక్ష్మిలాంటి.అనేక పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. రైతులే స్వయంగా మేము వస్తామని అంటున్నారు. లక్షల ఎకరాలు ఎండబెట్టి రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వుండి పంటలు ఎండబెట్టిన దంద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత పది ఎండ్లలో 30 నుండి 35 శాతం నీళ్ళు వాడేది కానీ 27శాతం నీళ్ళు వాడి పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, ఇచ్చింది బిఆర్ఎస్ అందుకే రైతులు స్వచ్చంధంగా తరలి వస్తున్నారు..మా పార్టీ తరలించిన కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్ ఎం మాట్లాడతారు అని ఎదురు చూస్తున్నారు. వారి పార్టీలో చర్చ మొదలైంది అని అన్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కార్యకర్తలు స్వీయ క్రమశిక్షణ తో మెదలాలి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు అని అన్నారు. వరంగల్ ప్రజలు విజ్ఞులు మీకు మీరుగా స్వయ నియంత్రణ కలిగి వుండాలి, ట్రాఫిక్ విషయంలో అందరూ సహకరించాలని కోరారు. ఈ రాష్ట్ర ప్రజల కష్టాలను దూరం చేయడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం కోసం ఈ సభ పెడుతున్నాం. కాబట్టి అందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలతో పాటు వ్యాపారస్తులు కూడా సహకరించాలి. అంచనాలకు మించి ప్రజలు తరలి రాబోతున్నారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా కుట్రపన్నె పరిస్థితి వుంది. కాబట్టి జాగ్రత్తగా వుండాలి అని సూచించారు. కావాలని పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చి సభను అడ్డుకుంటారు, సభకు ట్రాఫిక్ జమైందని అంటారు కాబట్టి ఎవరు కూడా నమ్మకుండా కేసీఆర్ మాటలు వినాల్సిందే రవల్సిందే అని అన్నారు. ఆయన వెంట హనుమకొండ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ భాస్కర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కల్లపల్లి రవీందర్రావు, మాది ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, వెంకటరమణరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.
…………………………………….