మల్లంపల్లి బ్రిడ్జి పనుల త్వరితగతిన పూర్తి చేయాలి…
ములుగు జిల్లా ఎస్పీ
ఆకేరు న్యూస్, ములుగు:
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకొని మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకాన్ ఆదేశించారు .
సోమవారం ఆయన మల్లంపల్లి బిడ్జిని పరిశీలించారు.మేడారం జాతర సమయంలో భక్తులకు వాహన రాకపోకల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా బ్రిడ్జి పనులను అత్యంత సమర్థవంతంగా తక్కువ కాలంలో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను జాతీయ రహదారి డి ఈ కిరణ్ కుమార్ ఏ ఈ చేతన్ లను ఆదేశించారు. బ్రిడ్జి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు తాను స్వయంగా మళ్ళీ వస్తానని అలాగే స్థానిక సీ ఐ, ఎస్ ఐ తరచూ పనుల స్థితిగతులను పరిశీలిస్తారని తెలిపారు.తనకు ఎప్పటికప్పుడు నివేదికను సమర్పించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారు లను కోరారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జి పనులను వేగంగా పూర్తిచేసేలా చూస్తూ, భక్తులకు సురక్షితంగా, సాఫీగా వాహన రాకపోకలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు.
ఈ కార్యక్రమం లో జాతీయ రహదారి శాఖ డీఈ కిరణ్ కుమార్, ఏఈ చేతన్ ములుగు సి ఐ సురేష్ ప్రోబషనరీ ఎస్ ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

