
* వినూత్న కార్యక్రమానికి సర్కారు శ్రీకారం
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. సాంతితిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు సేవలను సులభతరంగా అందించేలా సీఎం చంద్రబాబు (CM Chandrababu) చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ (Watsup Governance) పై అవగాహన కల్పించడానికి ఏప్రిల్ నెలలో ‘ప్రతి ఇంటికి మనమిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్ ఫోన్లో 9552300009 నంబర్ ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్ లోనే అందిస్తామని తెలిపారు.
……………………………………………