
ఆకేరు న్యూస్ డెస్క్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఘనంగా నివాళులర్పించారు. ముఖ్దుం భవన్ లో సురవరం పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంద కృస్ణ మాదిగ కు మొదటినుంచి మద్దతు తెలిపిన సురవరం ఇటీవల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విజయం సాధించిన నేపథ్యంలో మందకృష్ణకు శుభాకాంక్షలు తెలుపగా మందకృష్ణ స్వయంగా సురవరం ఇంటికి వెళ్లి తన ఉద్యమానికి మొదటినుంచి ప్రోత్సహించినందుకు సురవరం సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
…………………………………………