
* గ్రాండ్‌గా బర్త్ డే వేడుకలు
* భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం
* పట్టు పడ్డ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సెలబ్రిటీస్, డబ్బున్న వారు,సినిమా వారు
ఇస్తున్న పార్టీలు రాను రాను విశృంఖలంగా మారుతున్నాయి. హైదరాబాద్
బెంగళూరు శివార్ల్లోని ఫాం హౌజ్ లో అర్ధరాత్రి వరకూ వేడుకల పేరుతో నానా
హంగామా చేస్తున్నారు. మద్యంతో పాటు, గంజాయి డ్రగ్స్‌ను వినియోగిస్తున్నార
ఇటీవలే బెంగూళూరు లో జరిగిన ఓ పార్టీలో క్యారెక్టర్ నటి హేమను పోలీసులు
అదుపులోకి తీసుకొని విచారించిన సంగతి తెల్సిందే.. తాజాగా ఫోక్ సింగర్
మంగ్లీ చేవెళ్ల సమీపంలోని ఓ రిసార్ట్ లో తన భర్త్ డే వేడుకలు జరుపుకుంది
అయితే ఈ బర్త్ డే వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి సరఫరా జరిగినట్టు
తెలుస్తోంది.పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించగా పోలీసులకు
విదేశీ మధ్యంతో పాటు గంజాయి లభ్యం కాగా వాటిని సీజ్ చేశారు.
వేడుకలో పాల్గన్న కొంతమంది వ్యక్తులకు గంజాయి పరిక్షలు నిర్వహించగా
అందులో 9మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. పోలీసులు నిర్వాహకులపై
ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
………………………………………