* దేశం కోసమే తన జీవితాన్ని దారపోశారు
* మన్మోహన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం
* సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావశంలో తీర్మానం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. మన్మోహన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని, దేశం కోసమే తన జీవితాన్ని దారపోశారని గుర్తు చేసుకున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు. శనివారం జరిగే మన్మోహన్సింగ్ అంతిమసంస్కారాల నిర్వహణపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొన్నారు.
……………………………………….