* మన్మోహన్ కేబినేట్లో పనిచేయడం అదృష్టం
* రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కేసీఆర్ ప్రకటన
* మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ నేతలు
* ఘనంగా నివాళులర్పించనున్న కేటీఆర్ బృందం
* కేసీిఆర్ ఆదేశాలతో హస్తినకు పయనం
ఆకేరున్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు భారత రాష్ట్ర సమితి నేతలు హాజరుకానున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరు కావాలని కేటీఆర్, ఎంపీలను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఆయనతో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్ అందించిన సహకారం తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని.. తెలంగాణ కోసం పోరాడిన సమయంలో ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిందని… రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో ఆయన అందించిన సహకారం మరువలేనదన్నారు. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్కు భారాస తరఫున ఘన నివాళులని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢల్లీికి బయల్దేరారు. అంత్యక్రియల్లో పాల్గొని మన్మోహన్ సింగ్కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
…………………………………………