
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని పలువురు మంగళవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ సమక్షంలో, మారపెల్లి మహేష్ ఆధ్వర్యంలో ఉప్పల్ గ్రామంలోని బీఆర్ఎస్, బీజెపి పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రణవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరామన్నారు. దాదాపు 70 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిల్కురి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండెద్దుల నాగరాజు, పూసల గణేష్, తాళ్ల శ్రీధర్, మిల్కూరి రాజు, సన్నీ,సముద్రాల సదయ్య, జక్కుల రాములు,సత్యపాల్,కొండ తిరుపతి, ఎండి అంకుశావళి,కొండ సతీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………