
encounter Police Force - File
* అమరుల త్యాగాలను స్మరిస్తూ ఆటా- పాట
ఆకేరున్యూస్,డెస్క్ : ఆపరేషన్ కగార్ (OPERATION KAGAR)పేరుతో ఓ వైపు కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్న నేపధ్యంలో అబూజ్ మడ్(ABOOZMAD) అడవుల్లో మావోయిస్టులు ఘనంగా వారోత్సవాలు నిర్వహించారు. మావోయిస్టు (MAOIST)లపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నవేళ,కీలక నేతలు భద్రతాదళాల చేతిలో ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో మావోయిస్టులు అబూజ్మడ్ అడవుల్లో ఘనంగా వారోత్సవాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ఏటా వారోత్సవాలు నిర్వహిస్తారు . ఈ మేరకు వారోత్సవాల వీడియోలు విడుదల చేశారు.ఈసారి మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించే అవకాశాలు ఉండక పోవచ్చని అందరూ భావించారు. పోలీస్ ల దాడులతో నాయకత్వం ,కేడర్ తీవ్రస్థాయిలోనష్ట పోయారు. అయినప్పటికీ మావోయిస్ట్ లు వారోత్సవాలు నిర్వహించి పోలీస్ లకు సవాల్ విసిరారు.. ఆగస్టు 1,2 తేదీల నుంచే ఈ వారోత్సవాలకు జనజమీకరణ చేశారని తెలుస్తోంది. . వారోత్సవాల సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ అడవి దద్దరిల్లేలా ఆటా- పాట కార్యక్రమం నిర్వహించిన ట్లుగా సమాచారం..
……………………………………………..