ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో మావోయిస్టు సభ్యురాలు మడవి సోని (30) ములుగు ఎస్పి శబరిష్ ఎదుట సోమవారం లొంగిపోయారు పోయారు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి శబరిష్ మాట్లాడుతూ పోలీసులు చేపట్టిన పోరుకన్నా, ఊరు మిన్న,మన ఊరు కు తిరిగి రండి. అనే కార్యక్రమానికి ఆకర్షితులై సోమీ లొంగిపోయారని వివరించారు.ఆమే కు 25, 000ల పునరావాస ఆర్థిక సహాయం అందించామన్నారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు ములుగు జిల్లాలో మొత్తం 85 మంది మావోయిస్టు సభ్యులు లోంగిపోయారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తూ జనజీవన స్రవంతిలో కలిసిన వారికి నగదు రివార్డు వైద్య సేవలు , ఆర్ధిక సహాయం సమాజంలో తిరిగి స్థిరపడటానికి పూర్తి మద్దతు అందించడం జరుగుతుందని వివరించారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలంటూ వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని వివిధ మధ్యల ద్వారా తెలియపరుస్తున్నామని ఎస్పీ వివరించారు .ఆయన వెంట ములుగు డిఎస్పి రవీందర్ తో పాటు పోలీస్ అధికారులు తదితరులు.
…………………………………………………..
