
మావోయిస్టులు.. ఫైల్ ఫోటో
* ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి
* మావోయిస్ట్ పార్టీ నేత జగన్ పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ నెల 18 వ తేదీన 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్కు సీపీఐ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసింది. మనువాద కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఐక్యమై పోరాడాలని మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ సాధించేందుకు రాజకీయ పార్టీలు పరస్పరం బురద చల్లుకోవడం ఆపి ఐకమత్యంతో పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేవిదంగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు పోరాడాలని పిలుపునిచ్చారు.
———————-