
* 14,400 గ్రాముల గంజాయి స్వాధీనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వేషము మార్చెను.. భాషను మార్చెను.. మోసము నేర్చేను.. అసలు తానే మారెను చందంగా నేటి వ్యవస్థలో మనుషుల వింత పోకడలు. అల్పకాలంలో.. అందినంత డబ్బు సంపాదనే పరమార్థం… దొరికితే దొంగ.. లేకుంటే దొరగా బతుకొచ్చనే ధీమా..
గంజాయి పార్శిల్స్ బ్రీఫ్ కేసులో పెట్టి దుస్తులు కప్పి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఓ స్మగ్లర్ కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం చిత్రపురికి చెందిన సునీల్ నాయక్ (sunil nayak) చదువు ఆపేసి ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని స్మగ్లర్‌గా మారాడు. ఒడిశాలోని ఓ సరఫరాదారుడి ద్వారా హైదరాబాద్(Hyderabad)లో కొంతమంది కస్టమర్స్‌తో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అవసరమైనప్పుడల్లా గంజాయిని కొని రెండు కేజీల చొప్పున ప్యాక్ చేసి బ్రీఫ్ కేసులో అమర్చి,. వాటిపై దుస్తులు పెడతాడు. సిటీలో ఉద్యోగానికి వెళ్తున్నట్లు బ్రీఫ్ కేసుతో బయలు దేరుతాడు. సికింద్రాబాద్‌కు చేరుకొని కస్టమర్స్‌కు విక్రయించి డబ్బు తీసుకొని వెళ్లిపోతుంటాడు. బుధవారం కూడా కోణార్క్ రైలు నుంచి బ్రీఫ్ కేసుతో సికింద్రాబాద్‌లో దిగి వెస్ట్ మెట్రో స్టేషన్ వద్ద కస్టమర్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సౌజన్య బృందం రంగంలోకి దిగి అతడిని పట్టుకుంది. 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దాని విలువ మార్కెట్లో రూ. 7లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్(Secunderabad Clock Tower) వద్ద గంజాయి విక్రయించేందుకుప్రయత్నిస్తున్న మరో స్మగ్లర్ జుర్రు ప్రవీణ్ (jurru praveen) ను పట్టుకున్నారు. అతని వద్ద 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన జాటోత్ అనిల్‌పైనా కేసు నమోదు చేశారు. వారిని, సరుకును సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.
………………………………………………..