
ఆకేరున్యూస్, ఖనాపూర్ : గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకమ్మ గుట్ట వద్ద గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ టీంతో పాటు స్థానిక ఎస్సై చిలకలగట్టు ఏరియాకు చేరుకొని నలుగురు
వ్యక్తలును అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి గంజాయి సంచులతో పాటు నెంబర్
ప్లేట్ లేని పల్సర్ బండిని స్వాధీనం చేసుకున్నారు. అందాల పాండు రెడ్డి,గుల్జారి
మునిరాజ్,కొప్పు కోటయ్య,భూక్య సాయికుమార్‌లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 23 సంచులలో 763.845 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎండు గంజాయి విలువ కేజీకి రూ.50 వేల చొప్పున మొత్తం Rs. 3,81,92,250 విలువ ఉంటుందని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ మంగళవారం తెలిపారు. మరో నలుగురు రమేష్, మజ్జి కృష్ణ ,నాయిని రమేష్, ప్రకాష్ లు ఈ దందాలో ఉన్నట్లు వెల్లడించారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం అని చెప్పారు.
…………………………………………..