* రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
* పండ్ల ట్రేలలో డీసీఎంలో తరలింపు
* వలవేసి పట్టుకున్న ఈగల్ టీమ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్(Hyderabad)లో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ టీమ్ పోలీసులు(Eagle Team Police) దాడిలో సోమవారం భారీగా గంజాయి వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో రూ.5 కోట్లు విలువైన 935 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బచ్చా ఆగయా అంటూ సీక్రెట్ కోడ్‌తో ఇటీవలి కాలంలో వినూత్నంగా మాటు వేసి అధిక సంఖ్యలో గంజాయి వినియోగదారులను పట్టుకున్న పోలీసులు.. వారి ద్వారా తీగ లాగితే డొంక కదిలింది. గంజాయిని ఒడిశా నుంచి మహారాష్ట్ర(Maharashtra)కు తరలిస్తుండగా ఈగల్ టీమ్ ఈ గంజాయిని పట్టుకుంది. గంజాయిని ప్యాకెట్లలో నింపి పండ్ల ట్రేల(Froots Tray)లో ఉంచి డీసీఎంలో తరలిస్తున్నారు. కీలక సమాచారంతో ఈగల్ టీం సభ్యులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న పవార్ కుమార్‌తో పాటు సమాధాన్ బిస్, వినాయక్ పవార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి గంజాయి సరఫరా చేసిన విక్కీ సేథ్, సచిన్ గంగారాం చౌహాన్ పరారిలో ఉన్నట్లు వెల్లడించారు.
………………………………………
