
* లాంఛనంగా ప్రారంభించిన టిటిడి
ఆకేరున్యూస్, తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులు అన్నప్రసాదాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటికే శ్రీవారి అన్నప్రసాద మెనులో మసాలా వడను చేర్చింది టీటీడీ.. అవి ఇప్పటి వరకు కొంతమందికే అందుతుండగా.. గురువారం నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు..ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తాను టీటీడీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో భక్తులకు అదనపు వస్తువును వడ్డించే ఆలోచనను ముందుకు తెచ్చాను అన్నారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన ఆ ఆలోచనకు అంగీకరించి ఆమోదించారని గుర్తుచేసుకున్నారు.. ఆలయ నిర్వహణలో ఇప్పటికే అధిక నాణ్యత గల పదార్థాలతో భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులకు వడ్డించే వడల తయారీలో పప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తివిూర, పుదీనా మరియు సోంపులను ఉపయోగిస్తారని వెల్లడిరచారు.. అన్న ప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 35,000 వడలను భక్తులకు వడ్డిస్తారని.. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు..ఇక, ఇదే విషయాన్ని సోషల్ విూడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వెల్లడిరచారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. తాను టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన నాకు కలిగింది.. నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లాను, ఆయన అంగీకారంతో.. గారెలను ఇవాళ ప్రవేశపెట్టాం.. నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు.. ప్రతీ రోజు ఉదయం 10:30 నుండి సా 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తాం.. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని ఎక్స్ లో పేర్కొన్నారు.
……………………………………